SSMB 30 : ఆ దర్శకుడితో వర్క్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ ?

Leave a Comment



సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29 చేస్తున్న సంగతి తెలిసిందే. 


ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు లోపు షూట్ మొత్తం పూర్తి కానుందట. అనంతరం విజువల్ ఎఫెక్ట్స్ సహా పెండింగ్ వర్క్ అంతా ముగించి 2027 ద్వితీయార్ధంలో దీనిని రిలీజ్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 


అయితే ఈ మూవీ అనంతరం మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం SSMB 30 సినిమాని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ చేయనున్నారని టాక్. 


గతంలో కూడా సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ఒక సినిమా చేయాల్సింది. డెవిల్ అనే టైటిల్ తో రూపొందాల్సిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ కథ కాకుండా ఈసారి పూర్తిగా కొత్త కథతో సందీప్ రెడ్డి సూపర్ స్టార్ తో మూవీ తీయనున్నారట. SSMB 29 రిలీజ్ తరువాత దీని గురించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని టాక్. 

Similar Links

0 comments:

Post a Comment