Vijay Deverakonda : 'రౌడీ జనార్ధన' ప్రారంభం ఎప్పుడంటే ?

Leave a Comment



యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) గ్రాండ్ గా నిర్మించనున్న రౌడీ జనార్ధన (Rowdy Janardhana) సినిమా చేయనున్నారు. 


ఈ సినిమాని యువ దర్శకుడు రవికిరణ్ కోలా తరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క పూర్తి స్క్రిప్ట్, కథ సిద్ధమైంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మరొక రెండు రోజుల్లో అనగా అక్టోబర్ 11న రౌడీ జనార్ధన సినిమా యొక్క అఫీషియల్ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 


అక్కడినుంచి త్వరగానే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించి వీలైనంత త్వరగా షూట్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో దీన్ని ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తుందట. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజున వెల్లడి కానున్నాయి. 


ఈమూవీలో విజయ్ దేవరకొండ మంచి మాస్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్. మంచి యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాహుల్ ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. యువ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇందులో కథానాయికగా నటించనున్నారు. 

Similar Links

0 comments:

Post a Comment