SSMB29 : ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారా ?

Leave a Comment


సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29 ఈ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 


ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 


కేఎల్ నారాయణ గ్రాండ్ గా శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ పై నిర్మిస్తున్న SSMB 29 సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ నవంబర్లో రానుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ అనుకుంటున్నారని అలానే టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అనౌన్స్మెంట్ ని నవంబర్ 16 న గ్రాండ్ గా ఎంతో భారీ స్థాయిలో అందించనున్నారని తెలుస్తోంది.


ప్రస్తుతం గ్లింప్స్ టీజర్ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అయితే జరుగుతోందట. అతిత్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు టీం నుంచి అధికారికంగా వెల్లడి కానున్నాయని ఈ ప్రతిష్టాత్మక సినిమాని 2027 ద్వితీయార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Similar Links

0 comments:

Post a Comment