నటుడు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజాగా కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1) సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు. సరిగ్గా మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతారా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో అంతకు మించేలా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కొనసాగుతోంది
కాంతారా చాప్టర్ 1. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), జయరాం కీలకపాత్రలని పోషించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ స్థాయిలో నిర్మించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.
ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. మరోవైపు అటు కన్నడ, హిందీతో పాటు మన తెలుగు ప్రేక్షకులు సైతం ఈ మూవీకి ఎంతగానో బ్రహ్మరథం పడుతున్నారు.
యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన డివోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన, ముఖ్యంగా పలు కీలక సీన్స్, ఇంటర్వెల్ తో పాటు పతాక సన్నివేశాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి మొత్తంగా ఫుల్ రన్ లో కాంతారా చాప్టర్ 1 ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి.
0 comments:
Post a Comment